PGCET: ఏపీ పీజీసెట్ నోటిఫికేషన్ విడుదల! 4 d ago

ఆంధ్రప్రదేశ్ పోస్టు గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్‌ను ఎస్వీయూ సెట్ కన్వీనర్ విడుదల చేసారు. ఈ పరీక్ష ద్వారా విశ్వ విద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో ఎంఎస్సీ, ఎంకాం, ఎంఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులు ఏప్రిల్ 2నుంచి మే 5వ తేదీ వరకు స్వీకరించనుండగా, జూన్ 9 నుంచి 13 వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు.